మధుసూదన్ కు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

 మధుసూదన్ కు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

పహాల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి నివాళులర్పించారు. మధుసూదన్ ఉత్తర క్రియల కార్యక్రమం కావలి పట్టణంలోని ఏవిఎస్ కల్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొని మధుసూదన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మధుసూదన్ నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, నున్నా మురళి, జనసేన నాయకులు సమ్మను వెంకట సుబ్బయ్య, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




google+

linkedin