అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
అల్లూరు మండలం సింగపేట పంచాయతీ మూర్తిరాజుసంగం గ్రామానికి చెందిన నాలుగు గడ్డి వాములు ఇటీవల అగ్నికి ఆహుతి కావడం జరిగిందన్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గురువారం మూర్తి రాజు సంగం లోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఆర్ధిక సహాయం చేశారు. నష్ట పరిహారం అందేవిధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి అమర్ రెడ్డి, పోలిశెట్టి శ్రీనివాసులు, పొట్టేళ్ల శ్రీనివాసులు, చల్లా రాంబాబు, జనసేన నాయకులు తేజ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.