రూ.8 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

 రూ.8 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

కావలి పట్టణంలోని 26వ వార్డుకి చెందిన షేక్ షకీలా నోటి క్యాన్సర్ బారిన పడి చికిత్స కొరకు ముందస్తు సహాయం కావలసినదిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని అభ్యర్థించడం జరిగింది. కావలి శాసనసభ్యులు సిఫార్సు మేరకు  ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.8 లక్షల ఆర్ధిక సహాయం (ఎల్ వోసి) చెక్ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తికొండ కిషోర్ బాబు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, గంగినేని వెంకటేశ్వర్లు ఎల్ వో సి చెక్ ను కావలి టీడీపీ కార్యాలయంలో ఆదివారం వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. చికిత్స కొరకు సహాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కావలి శాసనసభ్యులు క్రిష్ణారెడ్డి కి వారు ధన్యవాదములు తెలిపారు..




google+

linkedin