హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
హనుమాన్ జయంతి పురస్కరించుకొని కావలిలో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా శోభాయాత్రలో పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ గ్రౌండ్ వద్ద నుంచి పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ముసునూరు ఆంజనేయస్వామి గుడి వరకు యాత్ర సాగింది. ఎమ్మెల్యే బైక్ నడిపి ర్యాలీని ఉత్సాహపరిచారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్
దళ్, బిజెపి, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో వేలాదిగా హిందూ ప్రజలు పాల్గొన్నారు. జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ పురవీధులు మారు మ్రాగాయి. అడుగడుగునా కాషాయ జెండాలతో కావలి కళకళ లాడింది. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు, పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు.