పేదవారికి ఉపాధి కల్పించబోతున్నాం చిరు వ్యాపారులకు భద్రత కోసం షాపింగ్ మాల్స్

పేదవారికి ఉపాధి కల్పించబోతున్నాం చిరు వ్యాపారులకు భద్రత కోసం షాపింగ్ మాల్స్

షాపింగ్ మాల్స్ నిర్మాణ పనులను పరిశీలించి ఎమ్మెల్యే 

పేదవారికి ఉపాధి కల్పించాలని చిరు వ్యాపారులకు కట్టుదిట్ట మైన భద్రత కల్పించేందుకు మున్సిపాలిటి షాపింగ్ మాల్స్ నిర్మించి తక్కువ బాడుగకు ఇస్తున్నామని ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం

కావలి పట్టణంలో ని ఉదయగిరి రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న మున్సిపల్ షాపింగ్ మల్స్ లను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి  పరిశీలించారు. రోడ్డుకి ఇరువైపులా  అనధికారికంగా చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ బిక్కు బిక్కు మంటూ  జీవనం సాగిస్తున్నారన్నారు. చిరు వ్యాపారుల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇరువైపులా షాపింగ్ మాల్స్ నిర్మించి తక్కువ బాడుగకు  వారికీ ఇవ్వడం జరుగుతుందన్నారు.

దీనివలన చిరు వ్యాపారులు  ధైర్యంగా వ్యాపారాలు చేసుకోవచ్చని అన్నారు. ఉదయగిరి రోడ్లో  మొత్తం 360 షాపులు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే త్వరలోనే ఆర్డిఓ, ఎమ్మార్వో కార్యాలయాల ముందు షాపింగ్ మాల్స్ నిర్మిస్తామన్నారు. అలాగే ఆర్ అండ్ బి  గెస్ట్ హౌస్ సమీపంలో కూడా షాపింగ్ మాల్స్ నిర్మించి  బాడుగకు ఇస్తామన్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి ఆదాయం పెరగటంతో పాటు కావలి టౌన్ సుందరంగా  ఉంటుందన్నారు. చిరు వ్యాపారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ అధికారులు, పట్టణ టిడిపి అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin