సమ్మర్ స్టోరేజ్ ను పున:ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.

 సమ్మర్ స్టోరేజ్ ను పున:ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి. 

40 లక్షలతో సమ్మర్ స్టోరేజ్ పనులను చేపట్టి సమృద్ధి గా త్రాగు నీటి అందించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

త్వరలో అల్లూరు మండల వ్యాప్తిగా త్రాగు నీటిని అందించేదుకు కృషి 

అల్లూరు మండల వ్యాప్తంగా సాగు నీటిని అందించే బాధ్యత తనదన్న ఎమ్మెల్యే కావ్య

జులై లోగ అల్లూరు ను నగర పంచాయతీ నుండి పంచాయతీగా మార్పు చేసేందుకు కృషి..

కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా,అల్లూరు మండల ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించవలసిన సమ్మర్ స్టోరేజీ మీరు ఉపయోగంగా ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి గురువారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి,స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బీద గిరిధర్ అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అధికారులు స్థానిక గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండిందని కానీ గత ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారి నీటిని శుద్ధి చేసే యంత్రాలన్నీ తుప్పు పట్టి వాటర్ ట్యాంకర్ బురద మురికి చేరిపోయి ఉండేయని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక నాయకులు బీద గిరిధర్,పలగాటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తో 40 లక్షలతో సమ్మర్ స్టోరేజ్ పనులను చేపట్టి సమృద్ధిగా తాగునీటినందించేందుకు కృషి చేశారనీ తెలిపారు.

ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా అల్లూరు మండల పరిధిలోని ఇస్కపల్లి, గోగులపల్లి,తూర్పు గోగులపల్లి, పురిణి, సింగపేట పంచాయతీలకు పూర్తిస్థాయిలో సురక్షిత మంచినీటినందించేందుకు జూలై లోగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మంచి నీటిని అందించడం మా బాధ్యత అని ఆయన తెలిపారు.ఈ సమ్మర్ స్టోరేజ్ నుండి అల్లూరు నగర పంచాయతీనుండి వెళ్లే పైప్ లైన్ లో పూర్తిగా ధ్వంసం కావడంతో త్వరలోనే కొత్త పైపులైను ద్వారా మంచినీటిని  అందిస్తామన్నారు. ఆల్లూరు మండలంలో చుట్టుపక్కల ఎక్కువ భాగం గిరిజన గ్రామాలు అని ఇలాంటి పేద ప్రజలకు మంచి నీటిని అందించడం మా యొక్క లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వాలు కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే గిరిజనులు ఉన్న పంచాయతీని నగర పంచాయతీ చేసి వారి పొట్ట కొట్టారని త్వరలోనే అల్లూరు నగర పంచాయతీని పంచాయతీగా మార్చి గిరిజనులకు ఉపాధి కల్పిస్తామన్నారు.అనంతరం అల్లూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అర్హులైన మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  డి ఈ లీల ప్రకాష్, ఆర్డబ్ల్యూసీఐ పురుషోత్తం, అన్ని శాఖల అధికారులు, నాయకులు పలగాటి శ్రీనివాస్ రెడ్డి, బండి అమర్ రెడ్డి, పడమర గోగులపల్లి సర్పంచ్ ఆట తిరుమల, మాజీ అప్క అప్ చైర్మన్ పోలిశెట్టి, ఊటు శ్రీకాంత్ రెడ్డి, మేడా కృష్ణారెడ్డి, రత్తయ్య, మేడా శ్రీనివాసరెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.


google+

linkedin