మందాడి చెరువును పరిశీలించిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం ముసునూరులోని మందాడి చెరువును కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, లైటింగ్, గ్రీనరీ, ఇతర ఏర్పాట్లకు సంబందించిన పలు అంశాలను ఎమ్మెల్యే గారు అధికారులతో చర్చించారు. మందాడి చెరువు వద్ద త్వరలోనే ఒక కొత్త రూపు తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.