మే డే వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో టిఎన్ టియుసి ఆధ్వర్యంలో, లత థియేటర్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద టిఎన్ టియుసి జెండాను, లత థియేటర్ వద్ద మే డే జండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు కార్మికులు బొకేలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కార్మికులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను వివరించారు. కార్మికులందరూ గ్రూపుగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి మీరు కట్టిన ఇన్సూరెన్స్ ఆధారమవుతుందన్నారు. అన్ని వృత్తులలో భవన నిర్మాణ వృత్తి ఎంతో విలువైనదన్నారు. ఎంత ధనికుడైన నివసించాలంటే ఇల్లును కార్మికుడు కట్టివ్వాల్సిందేనన్నారు. అలాంటి కార్మికులందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. నేను ఎమ్మెల్యేను అయినా కూడా మిమ్మల్ని అందరిని కాపు కాసుకునే ఒక కార్మికుడిని అని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని, కష్టపడి పని చేసుకుంటూ అంచలంచెలగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవ చేసుకుంటున్నాను అన్నారు. కాబట్టి కార్మికుల కష్టం తెలుసునన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసునన్నారు. కావలిలో కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, పొట్లూరి శ్రీనివాసులు, పోతుగంటి శ్రీకాంత్, తటవర్తి వాసు, తిరివీధి ప్రసాద్, శానం హరి, పల్లపు మోహన్, ఆయా కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, భవన నిర్మాణ నాయకులు కార్మికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..