తెలుగు వాడి గొప్పతనానికి నాంది పలుకుతూ ఏర్పాటుచేసిన సభే మహానాడు
నాడు ఇంద్రుడు అమరావతిని నిర్మిస్తే, ఈ చంద్రుడు దానిని తలదన్నే అమరావతిని నిర్మిస్తున్నాడు - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
తెలుగువాడి గొప్పతనానికి నాంది పలుకుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ మహానాడు అని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ మహానాడు కార్యక్రమం నెల్లూరు లోని విపిఆర్ కన్వెన్షన్ లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు, పేదవాడికి ధనవంతుడికి మధ్య తార తమ్యాలు పెరగకుండా ఉండాలి, పేదవాడిని అక్కున చేర్చుకోవాలి, తెలుగు భాషను తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి, తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పటానికి దివంగత నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల 10 రోజులలోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరా గాంధీ యొక్క ప్రభంజనాన్ని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ 1983 జనవరి 10వ తేదీన ముఖ్యమంత్రిగా, నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో, రేపటి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశానికి ఎదురు లేకుండా, కార్యకర్తల అండగా, పేదవాడికి అండగా, ఐదు ఏళ్ళు నోట్లోకి పోయేటట్టుగా, పేదవారికి ప్రోత్సాహాన్ని చూపించే ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడు ఉంటుందనే దానికి నాందే ఈరోజు ఇంతమంది కార్యకర్తల సమావేశం అని అన్నారు. ఎప్పుడో కృతాయుగంలో ఇంద్రుడు అమరావతిని నిర్మిస్తే, ఈ చంద్రుడు ఈరోజు అమరావతిని ఆ అమరావతికి తలదన్నే విధంగా ఈరోజు అమరావతిని ఏర్పాటు చేయబోతున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయదారుడు, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈరోజు పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేస్తూ మన అందరి జీవితాలలో వెలుగును నింపుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు కృషి వల్ల కావలి నియోజకవర్గం బాగా వెలుగొందుతుందని, బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన నెల్లూరు జిల్లాకి తలమానికంగా ఉండబోయే విధంగా ఈరోజు బిపిసిఎల్ కంపెనీని కావలి నియోజవర్గానికి అందించినటువంటి ముఖ్యమంత్రికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలన్నారు. గత ఐదు సంవత్సరాలు విద్వంసమైన పరిస్థితుల్లో నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దగదర్తి విమానాశ్రయానికి భూమి పూజ చేస్తే, గత ఐదు సంవత్సరాల విద్వంసంలో ఆ భూమిలోనే గ్రావెల్ తవ్వుకున్న సంఘటలు జరిగాయన్నారు. విమానాశ్రయాన్ని తిరిగి దగదర్తికి అందించినటువంటి ముఖ్యమంత్రి ధన్యవాదములు తెలిపారు. పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రికి అదేవిధంగా లోకేష్ బాబుకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలన్నారు. అనంతరం కావలి కి సంబందించిన తీర్మానాలను అమోదించాలని ఎమ్మెల్యే కోరారు.