కావలి పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా గుర్రం పెట్రోల్ బాంక్ నుంచి ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వరకు కావలి శాసనసభ్యులు ర్యాలీ నిర్వహిచారు.

నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా గుర్రం పెట్రోల్  బాంక్ నుంచి ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వరకు స్థానిక శాసనసభ్యులు  దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ వంశీ కృష్ణ, డీఎస్పీ శ్రీధర్, కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసిల్దార్  శ్రావణ్ కుమార్, ఎంపీడీవో శ్రీదేవి  లతో కలిసి తీరంగా ర్యాలీ నిర్వహిచారు. ఈ ర్యాలీకి కూటమి సభ్యులతో పాటు  అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, మాజీ సైనికులు, స్థానిక ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో జయహో భారత్ మాత అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్  ఉగ్రముఖలను  సమర్థవంతంగా ఎదుర్కొన్న  ప్రధానమంత్రి మోడీకి అభినందనలు తెలిపారు. ఈ పాకిస్తాన్ విగ్రహం ముకులను ఇంకా పూర్తిస్థాయిలో అంతమొందించాలని ఆయన కోరుకుంటున్నామన్నారు. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భారతీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు... భారతీయుల యువత దేశ రక్షణ కోసం ముందుండాలని కోరారు.

google+

linkedin