పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 21-06-2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. కావలి పట్టణం కచ్చేరిమిట్టకు చెందిన షేక్ ఛాన్ బాషా - అభీ మున్నీసా కుమార్తె వివాహం కావలి పట్టణంలోని బృందావనం కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు... అనంతరం కావలి పట్టణం 17వ వార్డు బుడంగుంట కు చెందిన షేక్ గులాం బాషా - మున్నీ దంపతుల కుమార్తె మెహనాజ్ పుష్పాలంకరణ కార్యక్రమం బుడంగుంట లోని వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు..