పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం సోదరుడు మొగల్ ఆరిఫ్ బేగ్ వివాహం శనివారం గుంటూరు లో జరిగింది. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం కావలి పట్టణం 8వ వార్డులోని వారి నివాసానికి చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. అనంతరం కావలి పట్టణం 8వ వార్డుకు సంబందించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు షేక్ ఆశిఫ్ అనారోగ్యంతో బాధపడి శస్త్ర చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం వారి నివాసానికి వెళ్లి ఆసిఫ్ ను పరామర్శించారు.. వైద్యుల సూచనలు పాటించి త్వరగా కోలుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.