వ్యవసాయానికి ఆనం వెంకటరెడ్డి పెద్దపీట

 వ్యవసాయానికి ఆనం వెంకటరెడ్డి పెద్దపీట

- రైతులపై మక్కువతో ప్రాజెక్టులను తీసుకువచ్చిన సృష్టికర్త ఆనం 

- ఆనం వెంకటరెడ్డి సేవలు మరువలేనివి...

- ఆనం వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

రైతులపై మక్కువతో ప్రాజెక్టులను తీసుకువచ్చి వ్యవసాయానికి నీరు ఇచ్చి పెద్దపీట వేసిన గొప్ప వ్యక్తి ఆనం వెంకటరెడ్డి అని 

కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరులో సింహపురి సేవా సమితి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారధ్యంలో పండుగ వాతావరణంలో దివంగత నేత ఆనం వెంకట రెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు రామలింగాపురం సర్కిల్ లో ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ సింహపురి ఉక్కుమనిషి, ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడు, నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, ఆనం వంశ రాజసానికి ప్రతీక ఆనం వెంకటరెడ్డి అన్నారు.రాష్ట్ర హోం మంత్రిగా, జల వనరుల శాఖ మంత్రిగా వెంకట రెడ్డి సేవలను ఆయన కొనియాడారు. నెల్లూరు రాజకీయాల్లో, అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానం అని జిల్లాలో సోమశిల, గండిపాలెం, రాళ్లపాడు ప్రాజెక్టుల ప్రారంభానికి ఆద్యుడు ఆనం వెంకటరెడ్డి అని చెప్పారు. వ్యవసాయ రంగానికి ఆనం వెంకటరెడ్డి చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఆనం వెంకటరెడ్డి తో  తన తండ్రి గారైన లక్ష్మీరెడ్డి తో ఎంతో అన్యోన్యమైన సంబంధం ఉందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు.. ఆ మహానుభావుడి చొరవతో నేడు కావలి, ఉదయగిరి నియోజకవర్గం లో రైతులు పంటలు పండించుకుంటూ పచ్చగా ఉన్నారన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి విగ్రహం పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు..

google+

linkedin