స్పైసీ హబ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం రైల్వే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్పైసీ హబ్ రెస్టారెంట్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు. రెస్టారెంట్ కు విచ్చేసిన ఎమ్మెల్యేను రెస్టారెంట్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని ఆహార ప్రియులకు అందించాలని రెస్టారెంట్ యాజమాన్యానికి ఎమ్మెల్యే గారు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఎమ్మెల్యే గారు కోరుకున్నారు.