ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ 

అనారోగ్య కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 29 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.25,80,418 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.  కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కావలి పట్టణంలోని మన్నెం గోపాల క్రిష్ణారెడ్డి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 402 మందికి రూ.4,04,34,051 పంపిణీ చేయడం జరిగిందని, మరో 210 మందికి చెక్కులు రావాల్సి ఉందని తెలిపారు.




google+

linkedin