జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అభినందించిన కావలి ఎమ్మెల్యే

 జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అభినందించిన కావలి ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా క్రికెట్ జట్టుకు కావలి కెసిఏ నుండి 5 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్ధులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సోమవారం అభినందించారు. అండర్ 19 విభాగానికి సమాధి భార్గవ్, లోకేష్ ఎంపిక కాగా, అండర్ 16 విభాగానికి రిషిత్, నవీంద్ర, యస్వంత్ ఎన్నికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అభినందించి భవిష్యత్తులో క్రికెట్ లో బాగా రాణించి రాష్ట్ర స్టాయిలో కావలికి మంచి గుర్తింపు తీసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. అలానే కావలి క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి ఎలాంటి సహకారం అయినా అందిస్తానని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి హామీ ఇచ్చారు. అలానే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్దు, క్రికెట్ కోచ్ రాజశేఖర్ పాల్గొన్నారు.




google+

linkedin