ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి - అధికారులను ఆదేశించిన కావలి ఎమ్మెల్యే
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం కావలి ఆర్డిఓ కార్యాలయంలో మునిసిపల్, విద్యుత్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ సంబంధిత సమస్యలు, వీధి దీపాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు కల్పించాలని, అధికారులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పని చేయాలని తెలిపారు.
ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని, విస్తరిస్తున్న పట్టణానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో సన్నీ వంశీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, ఎలక్ట్రికల్ డిఈ బెనర్జీ, ఎడిఈ రవి కుమార్, మున్సిపల్ డిఈ సాయి రామ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు...