మంత్రి నారాయణ గారిని కలిసిన కావలి ఎమ్మెల్యే..
కావలి పట్టణ నడిబొడ్డున మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు పై ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు జాతి ఆణిముత్యం వంగవీటి మోహన రంగా గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జులై 2వ తేదీన జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసినదిగా రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, కావలి కాపు నేతలు, వంగవీటి మోహన రంగా గారి అభిమానులు విజయవాడ లోని మంత్రి గారి కార్యాలయంలో బుధవారం కలిసి ఆహ్వానించారు. తప్పక విచ్చేస్తానని మంత్రి గారు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు..