మహిళలను కించపరుస్తున్న వైసిపి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
- కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మహిళ లను తీవ్రంగా కించపరిచేలా మాట్లాడుతున్న వైసీపీ నేతలు, ఆ పార్టీ చానల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కావలి పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం హెచ్చరించారు. ఆదివారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తమకు ఓటు వేయలేదని అక్కసు వైసిపి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని, రాష్ట్రంలో వైసీపీ నేతలు మృగాల మాదిరిగా మారిపోయి ఇష్టానుసారం ప్రవర్తించటం వారి బరితెగింపుకు నిదర్శనం అని వారికి త్వరలోనే ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని అన్నారు. మహిళలను కించపరిచేలా ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. అసభ్య పదజాలంతో దూషణ డిబేట్లు పెట్టిన సాక్షి యాజమాన్యం, వై.యస్ భారతీ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని, దూషించిన కృష్ణంరాజును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి వెంటనే శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.