నలంద వరల్డ్ స్కూల్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే 21-06-2025

నలంద వరల్డ్ స్కూల్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణంలోని స్థానిక వెంగళరావునగర్ నలంద వరల్డ్ స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని రిబ్బన్ కట్ చేసి స్కూల్ బ్రాంచ్ ను ప్రారంభించారు. స్కూల్ కు విచ్చేసిన ఎమ్మెల్యే కు స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ విదేశాల స్కూల్స్ లో జరిగేటటువంటి ప్రోగ్రాంను కావలి పట్టణంలో నడపడం ఎంతో ఆనందదాయకమైన విషయమని కొనియాడారు. విద్యార్థులు కాలాన్ని వృథా చేసుకోకూడదని, మీ కోసం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని దానికి మీరిచ్చే బహుమతి బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించుకోవడమేనని అన్నారు. విద్యార్థులకు మార్కులు కోసం కాకుండా మంచి నైతిక విలువలు కలిగిన విద్యను అందించి వారిని బావి భారత పౌరులుగా తీర్చిదిద్ది కావలి పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని స్కూల్ యజమాన్యాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో నలంద విద్యా సంస్థల అధినేత  ఎం.డి మజహర్ మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించామని, అనేక సంవత్సరాలు రాష్ట్ర, జిల్లా మరియు పట్టణ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనపరించారని అన్నారు. డైరెక్టర్ ఫహీమ్ మాట్లాడుతూ కావలి పట్టణంలాంటి ప్రాంతాల్లో ఇలాంటి కరిక్యులం ప్రారంభించిన ఏకైక విద్యా సంస్థ నలంద అని అన్నారు. ఈ ప్రోగ్రాంను మంచి ప్రణాళికతో ముందుకు నడిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్  ఫరీదా బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.



google+

linkedin