రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం ముసునూరు రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మంగళవారం పరిశీలించారు. మొదటి లైన్ పై పట్టాలను తొలగించి బాక్స్ బ్రిడ్జి ఏర్పాటుకు అధికారులు పనులు ప్రారంభించారు. బ్రిడ్జి పనులను త్వరితిగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని రైల్వే అధికారులను ఎమ్మెల్యే కోరారు.