మిస్టర్ సింహపురి స్టీల్ మెన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ 2025' రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు

శారీరక ధృడత్వం క్రీడలతోనే సాధ్యం... పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.... ఈరోజు కావలి పరిపూర్ణమైంది... ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

 శారీరక దృఢత్వం  క్రీడలతోనే సాధ్యమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి  అన్నారు...
నెల్లూరు జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో ఆదివారం 'మిస్టర్ సింహపురి స్టీల్ మెన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ 2025' రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధులగా స్థానిక శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, డి.ఎస్.పి శ్రీధర్, ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్, ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాడీ బిల్డింగ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ వారు హాజరైయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఉమెన్ మోడల్ ఫిట్నెస్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ సంజన (ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్), అర్జున్ అవార్డు గ్రహీత నేషనల్ భాస్కరన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది క్రీడాకారులు 10 విభాగాలలో పోటీ పడ్డారు. విజేతలకు ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి, ఎంపీ మస్తాన్ రావు లు బహుమతులను అందజేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడలపై మక్కువ పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కావలిలో తన మామ ఆశయాలను కొనసాగిస్తూ కావలి ఖ్యాతిని ఇండియా స్థాయిలో పేరు తీసుకువచ్చాలా కృషి చేస్తున్న జగన్ కు ధన్యవాదా లు తెలిపారు.

google+

linkedin