కావలి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి,రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు..

కావలి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి,రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు.. 

కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారు ఆదివారం కావలి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు..కావలి పట్టణంలో వివిధ పత్రికల్లో విలేకరిగా 40 సంవత్సరాల నుండి  పనిచేస్తున్న వార్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్యవైశ్య నాయకులు ఓలేటి నాగేశ్వరరావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి,రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారు ఆదివారం నాగేశ్వరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగేశ్వరావు కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తన కలం ద్వారా అనేక సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరింప చేశారని అన్నారు. 

ఒక మిత్రుడుగా అనేక సలహాలు అందించేవాడని తెలిపారు. నాగేశ్వరరావు లేని లోటు వ్యక్తిగతంగా తనకు కూడా లోటని తెలిపారు... అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి, కావలి వాసి షేక్ ఖాదర్ భాషా కుటుంబ సభ్యులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారు పరామర్శించారు. ముందుగా ఖాదర్ బాషా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పట్టణ మైనార్టీ అధ్యక్షులు రహీం, టిడిపి నాయకులు,తిరివీది ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు దేవకుమార్,పట్టణ మహిళా అధ్యక్షురాల అర్షియా బేగం,స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin