సాక్షి ఛానల్ లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ కావలి కూటమి పార్టీల మహిళలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు

సాక్షి ఛానల్ లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ కావలి కూటమి పార్టీల మహిళలు, మహిళా సంఘాలు  నిరసన వ్యక్తం చేశారు. సెల్ఫీ పాయింట్ వద్ద నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, కావలి పట్టణ టిడిపి మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం మాట్లాడారు. మహిళలు పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని, సాక్షి టీవీ ఛానల్ మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

google+

linkedin