యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది
- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలిపారు. శనివారం కావలి పట్టణంలోని మినీ స్టేడియం లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కావలి పురపాలక సంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున విచ్చేసిన వారితో స్టేడియం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. విశాఖపట్నం లో జరుగుతున్న యోగా కార్యక్రమాన్ని తిలకిస్తూ, యోగాసనాలను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైజాగ్ లో జరుగుతున్న యోగా కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగిందని వివరించారు. యోగ అనేది మనిషిలో ఒక భాగం కావాలని, మానసిక ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, శరీర ఆకృతిని పెంచుకోవడానికి, శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించుకోవడానికి, సమస్యల నుంచి బయట పడడానికి, ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి సూత్రంగా యోగ పని చేస్తుందని తెలిపారు. మన ప్రధాని గారు మోడీ కృషితో ఈరోజున జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి, నేడు 11వ వార్షికో జరుపుకుంటున్నామని, గిన్నీస్ బుక్ రికార్డుని సాధించబోతున్నామని తెలిపారు. కొన్ని కోట్ల మంది ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి ఒక వరల్డ్ రికార్డుని ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ, రెండో విధంగా 5 లక్షల మందితో ఒకే ప్రాంతంలో ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదగా జరగటం మరొక గిన్నీస్ బుక్ రికార్డు గా ఎక్కిందన్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని 30 నిమిషాల పాటు యోగాన్ని సాధన చేయగలిగితే, అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. మన ఆరోగ్యం బాగుండాలి, మన దేశం బాగుండాలి అంటే, మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో వంశీ కృష్ణ, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి డిఎస్పీ శ్రీధర్, యోగా గురువులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..