కావలి నియోజకవర్గంలో రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు.

 కావలి నియోజకవర్గంలో రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు.

శ్రీ‌ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నారు. బోగోలు మండలం అల్లెమడుగు పంచాయతీ కడనూతల‌ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో‌ వైసీపీకి చెందిన కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఆ ప్రభుత్వ భూమిలో‌ ముళ్లపొదలు పెరిగాయి. పాములు, తేళ్లు చుట్టుపక్కల ఇళ్లలోకి వస్తూ ఉండటంతో, ఇదేమిటని స్థానికులు ప్రశ్నించారు. స్థానికులపై వైసీపీ నాయకుడు నాటకరాణి వెంకటరమణయ్య వారి మూకలు మారణాయుధాలతో దాడికి తెగపడ్డాయి. నాటకరాణి సిరేంద్ర అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధితులని పరామర్శించారు. అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.

google+

linkedin