సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన కావలి ఎమ్మెల్యే

 సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన కావలి ఎమ్మెల్యే 

కావలి పట్టణం 8వ వార్డు చింతం వారి వీధిలో రూ.22 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డుకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసక పాలన సాగిందని, కనీసం రోడ్డు వేసే పరిస్థితి కానీ, చిన్న కాలువ కట్టడం కూడా చేయలేదని, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహారించారని విమర్శించారు. కూటమి పాలనలో ఎంతో అభివృద్ధి సాధించామని, ముందు ముందు మరెంతో అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, డిఈ సాయి రామ్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin