కలర్స్ మున్నా డాన్స్ 23వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కలర్స్ మున్నా డాన్స్ 23వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణం మొగల్ హబీబ్ బేగ్ షాదీ మందిర్ లో ఆదివారం రాత్రి 'RONK N ROLL' డాన్స్ మాస్టర్ కలర్స్ మున్నా డాన్స్ 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడంతో సభా ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది.

డాన్సర్స్ తోఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికిన మున్న డాన్స్ మాస్టర్, కళాకారులు,వార్డు నాయకులు. అనంతరం మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.డాన్స్ మాస్టర్ మున్నా ఆధ్వర్యంలో జరిగిన డాన్స్ ప్రోగ్రాం ఎమ్మెల్యే గారు తిలకించారు.

ఎమ్మెల్యే గారి మీద కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల నృత్య ప్రదర్శనలు  ఆహ్రూతులను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కళాకారులను అభినందించి ఘనంగా సన్మానించారు..ఎమ్మెల్యే గారి చేతుల మీదగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కలర్స్ మున్న డాన్స్ టీం..ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించిన మున్న డాన్స్ మాస్టర్..

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో పాల్గొంటాం చాలా సంతోషంగా ఉందని మున్న ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని కావలి నియోజకవర్గంలో ఉన్న కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు..👆👆

google+

linkedin