మాజీ ఏఎంసి మాతృమూర్తికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే
కావలి మాజీ ఏఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి మాతృమూర్తి అన్నపూర్ణమ్మ గారు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం కావలి పట్టణంలోని సుకుమార్ రెడ్డి నివాసానికి చేరుకొని అన్నపూర్ణమ్మ భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు...