సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి ఇల్లూ సంతోషంగా ఉంది - ఎమ్మెల్యే 04-07-2025

 సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి ఇల్లూ సంతోషంగా ఉంది

- సమస్యల సత్వర పరిష్కారమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యం

- ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

- కావలి పట్టణ 8వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

కూటమి ప్రభుత్వ సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి ఇల్లూ సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి నెలకొందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు కావలి పట్టణంలోని 8వ వార్డు చింతం వారి వీధిలోని 96, 97 బూత్ లలో పర్యటించారు. వార్డులోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివరాలను మై టీడీపీ యాప్‌లో అప్‌ లోడ్‌ చేసి వారితో సెల్ఫీ దిగారు. కరపత్రాలు అందచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న, అమలు చేయబోయే పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారని, సత్వరం సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో మంత్రి నారా లోకేష్ సూచనలతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని, సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ప్రజలకు ఏం కావాలో వారి ఆలోచనలకు తగ్గట్టుగా పనులు చేయడం జరుగుతోందన్నారు. అర్హులకు సమయానికి ఎన్టీఆర్‌ భరోసా అందుతోందని, ఇటీవల విద్యార్ధులకు తల్లికి వందనం డబ్బులు అందాయని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ ప్రారంభం కాబోతోందన్నారు. వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, యూనిట్ ఇంచార్జిలు, బూత్ కన్వీనర్లు, కేఎస్ఎస్ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...













google+

linkedin