స్కూల్లో టీచర్ గా మారిన ఎమ్మెల్యే..
అల్లూరు మండలం నార్త్ మోపూరు పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
అల్లూరు మండలం నార్త్ మోపూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం సందర్శించారు..రోజా పూలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన విద్యార్థులు,ఉపాధ్యాయులు.విద్యార్థులను స్కూల్లో భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ప్రతి విద్యార్థిని పైకి లేపి జీవితంలో ఏమవుతారు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే..సార్ మేము పోలీస్ అవుతాము,మేము డాక్టర్ అవుతామని ఎమ్మెల్యేకి చెప్పిన విద్యార్థులు..విద్యార్థుల మాటలకు ఆనంద వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. తల్లికి వందనం అందిన తీరును విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు..చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే వారికి తెలిపారు.. స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే..