ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

 ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

- కావలి నియోజకవర్గంలో దారిద్ర్య రేఖకు దిగువన 9000 కుటుంబాలు 

- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి

- స్వర్ణాంధ్ర 2047 పై సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయిస్తున్నారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. బుధవారం కావలి ఆర్డీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం పై ఆర్డీవో, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో దారిద్ర రేఖకు దిగువన దాదాపు 9000 కుటుంబాలు ఉన్నాయని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకునేందుకే పీ పోర్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కావలిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, 2047వ సంవత్సరానికి కావలి ఏ విధంగా ఉండాలనే విధానాలపై డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, ఆ విధంగా ప్రణాళికలు రూపొందించు కోవడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు పి4 పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దేశంలో మొట్టమొదటి పి ఫోర్ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కావలి నియోజకవర్గంలో దాదాపు 9000 కుటుంబాలు దారిద్ర దిగువరేఖన ఉన్నందువల్ల, మరీ చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నందువల్ల వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం అని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు ఈ కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందని, వారికి అవసరమైన అన్ని సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పేద కుటుంబాన్ని బంగారు కుటుంబం గా మారుస్తామని తెలిపారు. ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉందో వారు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని, ఆ కుటుంబానికి అండగా ఉండగలిగితే నిజంగా మన జీవితానికి ధన్యత ఉంటుందన్నారు. దేవుడి గుడికి దానం చేయడం కంటే మానవుడి జీవితాన్ని బాగుపరచగలిగితే అదే దేవుడు హర్షించే నిజమైన విషయమని, కాబట్టి ప్రజలందరూ కూడా మానవ సేవకు అంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సన్నీ వంశీ కృష్ణ, ఎంపిడిఓ శ్రీదేవి, నియోజకవర్గంలోని తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, హోసింగ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడివోలు, ఉద్యానవన శాఖ అధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు, మున్సిపల్ అధికారులు,  ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


google+

linkedin