మనీ స్కామ్ సూత్రదారి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 25-07-2025

 మనీ స్కామ్ సూత్రదారి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 

జిల్లాలోనే అతి తక్కువ మెజారిటీతో గాలి లో గెలిచింది ప్రతాప్ రెడ్డి
మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే ప్రమేయం

విషయం పక్కదారి పట్టించడానికే పిచ్చి కూతలు 

వైసీపీ ఉనికిని చాటుకోవడానికే ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పై విమర్శలు 

ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే దిగజారుడు వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పై మండిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు

అనంతార్ధ అసోసియేట్ మనీ స్కాంలో సూత్రధారి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.

శుక్రవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, దావులూరి దేవకుమార్, బాల గురుస్వామి, దేవరకొండ శ్రీను, పద్మావతి శ్రీదేవి, తిరివీధి ప్రసాద్, జనసేన నాయకుడు సిద్దు మాట్లాడారు. అనంతార్ధ అసోసియేట్ వ్యవస్థాపకులు, మనీ స్కామ్ ప్రధాన నిందితుడు సుభాని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కి కర్ణాటక లో పరిచయం కావడం, 2021 లో కావలి లోని తన నివాసానికి సమీపంలో వ్యాపారం ప్రారంభించడానికి సహకారం అందించడం జరిగిందని తెలిపారు.

వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ కంపెనీకి ఏజెంట్లు గా వైసిపి వాళ్లే ఉండటం జరిగిందని తెలిపారు. వ్యాపారం సజావుగా సాగడానికి సహకారం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే కు సుభాని ప్రతినెలా కొంత కమిషన్ ను పంపడం జరుగుతూ ఉండేదని తెలిపారు.

2024 కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఎమ్మెల్యేగా కావ్య క్రిష్ణారెడ్డి గెలిచిన తరువాత కొంతమంది బాధితులు ఎమ్మెల్యే ను కలవడం జరిగిందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టవలసిందిగా పోలీస్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించడం జరిగిందని తెలిపారు. దీనిలో 30 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు సమాచారం ఉన్నదని తెలిసి 29 మందిని ముద్దాయిలుగా నిర్ధారించి, సుభాని ని  యలసిరి బ్రహ్మానందం ను అరెస్ట్ చేయడం జరిగిందని, మిగిలిన వారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సుమారు రూ. 12 కోట్ల వరకు డబ్బులు, ఆస్తులను పోలీసు వారు సీజ్ చేయడం జరిగిందని, కోర్టు ద్వారా ప్రజలకు ఆ మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ మనీ స్కాం విషయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రెండుసార్లు గాలిలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జిల్లాలోనే అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డాడని, ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కావలి చరిత్రలోనే రికార్డు మెజారిటీతో గెలుపొందాడని గుర్తు చేశారు.

మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉండటంతోనే, దానిని పక్కదారి పట్టించడానికి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కావటం తద్యమని తెలిపారు. విషయం పక్కదారి పట్టించడం కోసమే మాజీ ఎమ్మెల్యే పిచ్చి కూతలు కూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. నిజమైన నిజాయితీపరుడు కావలిని అభివృద్ధి చేయగల నాయకుడు కావ్య క్రిష్ణారెడ్డి మాత్రమే అని తెలిపారు. గతంలో గంజాయికి, డ్రగ్స్ కి నిలయమైన కావలిని, ప్రశాంత కావలిగా డ్రగ్స్ రహిత కావలిగా చేయడంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కృషి ఎనలేనిదని తెలిపారు. ఈ మనీ స్కామ్ లో టిడిపి వాళ్లు ఎవరూ లేరని 2021 లో ప్రారంభమైన ఈ మనీ స్కాంలో అంతా వైసిపి వాళ్లే ఉన్నారని తెలిపారు. వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీలోని ప్రతి స్కీం వెనక ఒక స్కాం ఉంటుందని తెలిపారు.

మద్యం కుంభ కోణంలో మాజీ ఎమ్మెల్యే ను సిట్ అరెస్ట్ చేయబోతుందని తెలిసి, దానిని డైవర్ట్ చేయడానికి సుభాని అరెస్ట్ అయిన 5 నెలలు తరువాత ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కావలిలో గత వైసీపీ హయాంలో వలె ఎక్కడ కూడా దందాలు జరగటం లేదని, ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని, స్వేచ్చా వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin