సుధమ్మకు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం మద్దూరుపాడుకు చెందిన రావినూతల సుధమ్మ ఉత్తర క్రియుల కార్యక్రమం బుధవారం మద్దూరు పాడులోని వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండా వెంకట్రావు, జీవ, గంగిరెడ్డి, విక్రమ్ రెడ్డి, జనసేన నాయకులు సిద్దు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.