పేదలను ధనవంతులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

పేదలను ధనవంతులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

పేదలను ధనవంతులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం కావలి పట్టణం కచ్చేరిమిట్ట లోని మీకోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని బ్లెస్డ్ హోమ్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. చిన్నారులు ప్రదర్శించిన నాటకం ఎమ్మెల్యేను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ పేద ప్రజలకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తుందని కొనియాడారు. కావలి నియోజకవర్గంలోని 9700 మంది పేదలను ఆర్ధికంగా బాగా స్థిరపడిన పలువురు దత్తత తీసుకొని వారికి సహకారం అందిస్తూ బంగారు కుటుంబాలుగా మార్చే బృహత్తరా కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పేదలకు తన సంస్థ ద్వారా పలు విధాలుగా సహాయం అందజేస్తున్న సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాయపాటి దిలీప్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందించారు. సంస్థ ఆధ్వర్యంలో ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ కుమార్ రాయపాటి, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పోట్లూరి శ్రీనివాసులు, తిరివీధి ప్రసాద్, సంస్థ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..








google+

linkedin