కావలిలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు

 కావలిలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు దిగ్విజయంగా 4వ క్లస్టర్ లో పూర్తి చేసుకున్న సుపరిపాలనలో ముందడుగు డోర్ టు డోర్ 

 ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తో భారీ కేకులు కట్ చేయించిన క్లస్టర్ ఇంచార్జిలు 

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో ముందడుగు డోర్ టు డోర్ కార్యక్రమం సోమవారంతో  4వ క్లస్టరీ లో స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనలతో  దిగ్విజయంగా  పూర్తి చేసుకున్న  శుభ సందర్భంగా  క్లస్టర్ ఇంచార్జ్  కండ్లగుంట మధుబాబు నాయుడు క్లస్టర్ కో ఇంచార్జి హజరత్  వార్డు ఇన్చార్జి లు, బూతు ఇన్చార్జులు  పార్టీ నాయకులు మంగళవారం భారీ కేకులు కట్ చేసి  సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేకులు కట్ చేసి పంచిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు  తమ సూచనలతో అప్పజెప్పిన కార్యక్రమాన్ని  బాధ్యతగా నిర్వర్తించిన ఇన్చార్జి లకు, నాయకులకు, కార్యకర్తలకు  ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.. ఇంకా ప్రతి క్లస్టరీలో కూడా  శరవేగంగా సుపరిపాలన తొలిగెడుకు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఇన్చార్జిలు నాయకులు  చేస్తున్నారన్నారు... రాష్ట్రం లోటు బడ్జెట్ లో చెప్పిన మాట ప్రకారం టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం కి  ఏ ఇంటికి వెళ్లినా కూడా ప్రజలు  ఎంతో ఆదరిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

వైసిపి  అరాచక పాలన నుంచి బయటపడి   ప్రజలు ఈరోజు శ్రీరాముని పాలనలో ఆనందంగా ఉన్నారన్నారు. త్వరలోనే మరికొన్ని చెప్పని పథకాలను కూడా  టిడిపి ప్రభుత్వం అమలు చేయబోతున్నారని చెప్పారు.. కావలి నియోజకవర్గం లో  నిరంతరం ప్రజలతోనే ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా  తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  ఏడాది పాలనలోనే కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, డ్రైనేజీ లు, కాలువలు నిర్మించడం  జరుగుతుందన్నారు. కొన్నిచోట్ల రోడ్లు మరమ్మతులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు.. మరి కొన్నిచోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయని  అది కూడా త్వరలోనే ప్రారంభం చేస్తామని తెలిపారు. ఇప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు.

ఆగస్టు నెలలో  మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించబోతుందన్నారు.. గత వైసిపి ప్రభుత్వం  ప్రజాధనాన్ని కొల్లగొట్టి దోచుకుంటే కూటమి ప్రభుత్వం  సంపదను సృష్టించుకుంటూ  సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు,టిడిపి సీనియర్ నాయకులు 4వ క్లస్టర్ ఇంచార్జ్ కండ్లగుంట మధుబాబు నాయుడు, కావాలి 19వ వార్డు ఇంచార్జ్  ఏగూరి చంద్రశేఖర్,క్లస్టర్ కో ఇంచార్జ్ షేక్ హజరత్,గంగినేని వెంకటేశ్వర్లు,శానం హరి,కుందుర్తి కిరణ్, మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు,అభిమానులు భారీగా పాల్గొన్నారు..

google+

linkedin