ఆర్ధిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందుకు
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తో కలిసి పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
ఎన్నికల హామీలు 95 శాతం పూర్తి చేశామన్న మంత్రి
మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక కృషి : ఎమ్మెల్సీ బీద
సమస్యలు తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు : ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి
రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుని వెళుతున్నదని రాష్ట్ర గనులు, భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం కావలి నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుమ్మలపెంట పంచాయతీ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ పథకాలను వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుమ్మపెంట లోని పట్టపుపాలెం వద్ద 42.6 రూపాయల వ్యయంతో అంతర్గత సిసి రోడ్లకు శంకుస్థాపన, తుమ్మలపెంట పల్లిపాలెం వద్ద 44 లక్షల రూపాయల వ్యయంతో జల జీవన్ మిషన్ కింద త్రాగునీటి వసతికి మరియు 27.4 లక్షల ఎంతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అదేవిధంగా ఓట్టూరు వద్ద 25 లక్షలు వేయంతో సిసి రోడ్లు నిర్మాణం 55 లక్షలు వ్యయంతో రక్షిత మంచినీటి పథకం శంకుస్థాపనలు శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర మరియు స్థానిక శాసనసభ్యులు దగు మాటి వెంకట కృష్ణారెడ్డి లతో కలిసి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలలో 95 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లను పెంచి అరియర్స్ తో పాటు కలిపి ఒకేసారి పింఛనుదారులకు చెల్లించడం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో 64 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారన్నారు. నెలకు 4000 రూపాయలు పింఛను ఇచ్చే రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. తల్లికి వందనం కింద కుటుంబంలోని చదువుతున్న పిల్లలందరికీ ఇంటర్మీడియట్ వరకు 13 వేల రూపాయలు వంతున చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రైతులను ఆదుకునే విధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద సంవత్సరానికి 20,000 వంతున మూడు విడతలుగా చెల్లించడం జరుగుతున్నది అన్నారు. ఇచ్చిన హామీలలో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మత్స్యకారులను ఆదుకునే విధంగా వేట నిషేధం సమయంలో సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అని వివరించారు.
శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు తెలిసిన వ్యక్తి మంత్రి కొల్లు రవీంద్ర అని కొనియాడారు. తమ ప్రభుత్వ హయాంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యధిక నిధులతో సిసి రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. అవసరం మేర అంగన్వాడి కేంద్రాలు తీసుకు రావడం జరిగిందన్నారు. గ్రామీణ సమస్యలు తెలుసుకునేందుకే ఈరోజు మంత్రితోపాటు ఇక్కడికి (తుమ్మలపెంట) రావడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు.
స్థానిక కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా తెలుసుకొని పథకాలు అందని వారికి అందే విధంగా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఒట్టూరు అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ఆయన అన్నారు. ఈరోజు సీసీ రోడ్డుతో పాటు మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజులలో డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా స్మశాన వాటికకు వెళ్లే రోడ్లను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అలేఖ్య, బీద గిరిధర్, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ పాల్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.