సుపరిపాలనలో తొలి అడుగును విజయవంతం చేద్దాం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

సుపరిపాలనలో తొలి అడుగును విజయవంతం చేద్దాం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి పట్టణ టీడీపీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలియపరుస్తూ ఇంటింటికి వెళ్దామని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే అభిప్రాయాలను సేకరిస్తూ మై టిడిపి యాప్ లో పొందుపరచాలని తెలిపారు. బూత్ లెవెల్ లోని కార్యకర్తలు, ఇంచార్జిలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, యూనిట్ ఇన్చార్యులు క్లస్టర్ ఇంచార్జిలు వారికి సహకారం అందించాలని తెలిపారు.

జూలై 2వ తేదీ బుధవారం కావలి పట్టణంలోని 15వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని, డోర్ టు డోర్ తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, కండ్లగుంట మధుబాబు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.





google+

linkedin