వంగవీటి మోహన రంగాకు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వంగవీటి మోహనరంగా 78వ జయంతి సందర్భంగా శుక్రవారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుపై గల వంగవీటి మోహన రంగా కాంశ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. రంగా మనకు దూరమై 37 ఏళ్లు అయినా ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగా అభిమానులు, కాపు నేతలు, టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.