జడ్పి సమావేశంలో పలు సమస్యలు లేవనేత్తిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

కేజీబీవీ స్కూలులో మౌలిక వసతులు కల్పించండి

- కావలి జడ్పి పాఠశాల సమీపంలోని పేదలకు పట్టాలు అందజేయండి

- జడ్పి సమావేశంలో పలు సమస్యలు లేవనేత్తిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

275 మంది విద్యార్థినులు ఉన్న కావలి కేజీబీవీ స్కూలులో మౌలిక వసతులు కల్పించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కోరారు. శుక్రవారం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి హాజరు కాగా, శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి,  కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి,   జిల్లా కలెక్టర్ ఆనంద్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన హాజరయ్యారు. దివంగత మాజీ జెడ్పీ చైర్మన్ బాలచెన్నయ్య కు సంతాపంతో ప్రారంభమైన సభ రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, తల్లికి వందనం పథకాన్ని అద్భుతంగా అమలు చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో సభ ముగిసింది. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం  పథకానికి సంబంధించిన మండల స్థాయి వివరాలను పొందుపరచకపోవడం భావ్యం కాదన్నారు. అదేవిధంగా కావలి జడ్పీ ఉన్నత పాఠశాలకి చెందిన 9 ఎకరాల భూమిలో 2 ఎకరాల్లో 174 పేద కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ వారికి ఇంటి పట్టాలు లేవని సభ దృష్టికి తేగా, భూబదలాయింపుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త విద్యుత్ మీటర్లు బిగించినందువల్ల కరెంట్ బిల్లులు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. గ్రామాల్లో సైతం త్రీ ఫేజ్ విద్యుత్ ఇస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యుత్ లైన్లను పెరుగుపరచాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో మోహన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నెల్లూరులో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశంలో జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొని తల్లికి వందనం కార్యక్రమం గురించి సమావేశంలో మాట్లాడిన  కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు

google+

linkedin