పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 13-08-2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి పట్టణం బృందావనం కాలనీకి చెందిన పబ్బతి వెంకటేశ్వరరావు - భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు ప్రసన్న వెంకట సాయి శ్రీనాథ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం బృందావనం కాలనీలోని కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కావలి పట్టణం జనతా పేట నార్త్ కు చెందిన గంటా విజయకుమార్ - మనోరమ దంపతుల కుమార్తె గీతాంజలి వివాహ నలుగు కార్యక్రమం వారి నివాసం లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. కావలి రూరల్ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మానం వేణు - ప్రమీల దంపతుల కుమార్తె లక్ష్మి ప్రియ వివాహ నలుగు కార్యక్రమం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. కావలి రూరల్ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన యెందేటి ప్రసాద్ - కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె మేఘన వివాహ నలుగు కార్యక్రమం వారి నివాసంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన కన్నె కేశవులు - లావణ్య దంపతుల కుమార్తె దివ్య వివాహ నలుగు కార్యక్రమం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. కావలి పట్టణం కో-ఆపరేటివ్ కాలనీ కి చెందిన రెవిన్యూ ఉద్యోగి బాలాజీ సింగ్ ఉత్తర క్రియల కార్యక్రమం వారి నివాసంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని బాలాజీ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కావలి పట్టణం బాపూజీ నగర్ కు చెందిన రామిరెడ్డి వెంకట రమణారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం వారి నివాసానికి చేరుకుని రమణారెడ్డి భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.