ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

 ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 

దగదర్తి మండలం మారేళ్లపాడు గ్రామంలో జరిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండల టిడిపి అధ్యక్షులు అల్లం హనుమంతరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, విగ్రహ దాత ఖాజా మస్తాన్,  టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

google+

linkedin