అరుణోదయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

అరుణోదయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

అరుణోదయా క్లాత్ మార్కెట్ 44వ వార్షికోత్సవ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పాల్గొన్నారు. మార్కెట్ కు విచ్చేసిన ఎమ్మెల్యే కు మార్కెట్ కమిటీ ప్రతినిధులు, వ్యాపారస్తులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసాదాన్ని స్వీకరించి వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి కీర్తి ప్రతిష్టలు పెంచడంలో దివంగత దొడ్ల రామచంద్రారెడ్డి మరియు ఆర్యవైశ్యుల పాత్రఎనలేనిదని కొనియాడారు. జవహర్ భారతిని స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు కావలి పట్టణాన్ని నిలయం చేసిన వ్యక్తి దొడ్ల రామచంద్రారెడ్డి అని, అలాగే 44 ఏళ్ళ క్రితమే వస్త్ర వ్యాపారానికి కాంప్లెక్స్ స్థాపించి, మినీ ముంబైగా పేరు ప్రాఖ్యతలు వైష్యులు తీసుకు రావడం జరిగిందని తెలిపారు. అందరి ఆతరాభిమానాలు చూరగొంటూ వస్త్ర వ్యాపారం ఇలాగే దినదినాభివృద్ధి జరగాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, బిజెపి నాయకులు కందుకూరి సత్యనారాయణ, సివిసి సత్యం, సుధీర్, తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin