సమాజంలో అత్యున్నత గౌరవం గురువుల సొంతం
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి
ఘనంగా బిటిఏ 25వ వార్షికోత్సవ వేడుకలు
సమాజంలో అత్యున్నత గౌరవం గురువుల సొంతమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం కావలి పెన్షనర్స్ భవనం నందు బిటిఎ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి హాజరైనారు. బిటిఎ సంఘం, ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చక్కగా వివరించారు. ఉపాధ్యాయులైన వారు జీవితానికి అంకురం వంటి వారని, విద్యార్థుల జీవితాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దగలవారని కొనియాడారు. గత ప్రభుత్వంలో టీచర్లు జీతాల కోసం ఎదురు చూసేవారని, నేడు 1వ తేదీనే జీతాలు అందుకుంటున్నారని తెలిపారు. టీచర్లకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యా శాఖ మంత్రి లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ మాట్లాడుతూ బీటీఏ సంఘం రాష్ట్రంలో బలమైన సంఘంగా, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ లో కూడా బీటీఎ సంఘం ఒక మహాశక్తిగా ఎదుగుతుందని తెలిపారు. ఒక మహిళను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఘనత ఒక బహుజన టీచర్ అసోసియేషన్ కు మాత్రమే దక్కుతుంది అని అన్నారు.
రాష్ట్రంలో అనేక జిల్లాలలో సంఘం బలోపేతానికి రాష్ట్ర శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని అదేవిధంగా బి టి ఏ సంఘం ఆవిర్భవించిన నెల్లూరు జిల్లా సంఘానికి తలమానికంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు మణి సుబ్బు మాట్లాడుతూ నేటికీ జిల్లాలోని 36 మండలాల్లో క్యాంపెయిన్ నిర్వహించి సభ్యత్వ నమోదు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మాస ప్రసాద్ గారు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధికి రాష్ట్ర శాఖ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు.
రాష్ట్ర నాయకులు విధిగా సంఘ సభ్యత్వ కార్యక్రమాల్లో, మండల కార్యాలయంలో విధిగా పాల్గొని జిల్లాని ముందు వరుసగా ఉంచాలని, అన్ని మండలాల్లో కాంపెయిన్ నిర్వహించి సత్తా చాటే విధంగా రాష్ట్ర నాయకత్వం మార్గదర్శనం చేయాలని కోరుకోరారు. ఈ సందర్భంగా అనేకమంది రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులను, రాష్ట్ర నాయకులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పల్లం వేణుగోపాల్, రాష్ట్ర కోశాధికారి పి ఆదినారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముసలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు వరుసగా మనోజ్ కుమార్, పి లక్ష్మయ్య, కట్టా రమేష్, ఎం.భాస్కర్ , వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర కార్యదర్శులు జిల్లా నాయకులు, జిల్లాలోని అన్ని డివిజన్లోని మండలాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.