రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది

 రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది

- అన్నదాత సుఖీభవ పథకం రైతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది

- వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

దగదర్తి మండలంలో పుష్కలంగా పంటలకు సాగు నీరు అందుతుండటం పట్ల రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం దగదర్తి మండలం దగదర్తి ఎస్టీ కాలనీలో వితంతు పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళుతూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి పెద్ద బిడ్డగా ప్రతి ఒక్కరూ సంతోషగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికీ అండగా నిలబడుతున్నారని, భర్త చనిపోయిన కుటుంబంలో భార్యలకు పెన్షన్ అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు. ఎన్నో సంవత్సరాల నుంచి పింఛన్లు రాక ఇబ్బంది పడుతున్న మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహకారంతో ఈరోజు కావలి నియోజకవర్గంలో 666 మంది మహిళలకు పింఛన్లు రావడం చాలా సంతోషకరమన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని, అన్నదాత సుఖీభవ పథకం రైతన్నల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని తెలిపారు. మండలాన్ని అభివృద్ధి పదంలో నడపడమే తన ధ్యేయమని తెలిపారు. డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, ఇక సాగునీటి కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన రోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన అనేక రోడ్లకు అనుమతులు తీసుకొని వచ్చి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. పేదల సేవే తన ధ్యేయమని తెలిపారు. గిరిజన కాలనీలో ప్రతి ఒక్కరికీ ఇంటి కాలనీ, పొలాలకి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రతి పేద కుటుంబానికి భరోసా కలిగించేందుకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, మండల టీడీపీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి వింజం కొండపనాయుడు, వడ్డే శ్రీనాద్, వడ్డే వినయ్, ఎంపిపి తాల్లూరు ప్రసాద్ నాయుడు, రవి రెడ్డి, అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు...

google+

linkedin