విష సంస్కృతికి బాటలు వేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి -కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 విష సంస్కృతికి బాటలు వేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి

నియోజకవర్గంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు

టీడీపీ కి పట్టున్న గ్రామాలే టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే నీచ రాజకీయం

జల్ జీవన్ మిషన్ శిలాఫలకం ధ్వంసం వెనుక వైసీపీ నేతలు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

ప్రశాంతంగా ఉండే కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విష సంస్కృతికి బాటలు వేస్తున్నారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. శనివారం కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో వైసీపీ నేతలు కూల్చిన జలజీవన్ మిషన్ శిలాఫలకం, పైలాన్ ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి జకరయ్య అనే వైసీపీ నేత ఆధ్వర్యంలో కరెంటు తీసేసి జల్ జీవన్ మిషన్ పైలాన్, శిలాఫలకాన్ని జెసిబితో ధ్వంసం చేసి శిధిలాలను ట్రాక్టర్ తో తరలించారని అన్నారు. దీనితో కావలిలో వైసిపి నేతల రౌడీయిజం మరోసారి బయటపడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతోనే ఈ శిలాఫలకం, పైలాన్ ధ్వంసం చేశారన్నారు. మత్స్యకారుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి పనులు చేపడుతున్నారన్నారు.

నియోజకవర్గం లో అల్లకల్లోలం సృష్టించడానికి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా అనంతపురం నుంచి మనుషులను తీసుకొని వచ్చి కావలి ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేలా కరెంటు వైర్ల పై తాళ్లతో కట్టిన రాళ్లు వేస్తున్నారన్నారు. కావలిలో నాకు, తెలుగుదేశం పార్టీకి వస్తున్న విపరీతమైన ఆదరణ ఓర్వలేక దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉన్న గ్రామాల్లో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చేలా కుట్రలు పన్నుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల నుంచి మనుషులను తీసుకువచ్చి అనేక ప్రాంతాల్లో కరెంటు తీసేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ నేత జకరయ్య ట్రాక్టర్, జేసిబిలతో  పైలాన్ ను కూల్చేశారని, తిరుపతి, రాజు, యానాదయ్య అక్కడే ఉండి ధ్వంసం చేపించారని అన్నారు. టిడిపి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలను విస్తృతంగా చేస్తున్నారని మండిపడ్డారు. 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో మేము గెలిచామని, ప్రతాప్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టారని అందుకే కులాలు, మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతాప్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. దీన్ని మేము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు. ప్రతాప్ రెడ్డికి నాపై కోపం ఉంటే నీ రౌడీల చేత ఏమైనా చేయించుకో గానీ, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు.

కావలిని కాపు కాస్తున్న నేను ఒంటరిగానే తిరుగుతున్నానని గుర్తు చేశారు. శిలాఫలకాలు ధ్వంసం చేసి, రోడ్లను ధ్వంసం చేసి, ప్రజలను ఇబ్బందులు పెడితే నీకు ఓట్లు వేయరని అన్నారు. కావలి ప్రజల జోలికి వచ్చినా, ప్రభుత్వాస్తులు జోలికి వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కనీసం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పై, ప్రజలపై కనీస గౌరవం లేదని, అందుకే ఆ శిలాఫలాకాన్ని ధ్వంసం చేశారని అన్నారు. నాపై ఎలాంటి ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గం లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే నా పని తనానినికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, మత్స్యకార కాపులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin