నాకు జన్మనిచ్చింది ఊరు హక్కున చేర్చుకుంది మీరు...
నా రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలైంది....
అగ్రహారంలో ఓనమాలు నేర్చుకున్న కావలిని కాపు కాస్తున్న
గంధ మహోత్సవ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
నాకు జన్మనిచ్చింది అగ్రహారం ఊరు నన్ను హక్కున చేర్చుకుంది ముస్లిం సోదరులు. అగ్రహారంలో ఓనమాలు నేర్చుకొని ఈరోజు ఎమ్మెల్యేగా కావలిని కాపు కాస్తున్నానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. గురువారం రాత్రి జలదంకి మండలం బ్రాహ్మణ కాక అగ్రహారం గ్రామంలో ముస్లిం సోదరులు ఘనంగా గంధ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. గంధ మహోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు.. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు భారీగా బాన సంచ కాల్చి పూలు చల్లుతూ మేల తాళాలతోటి ఘనంగా స్వాగతం పలికారు.ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముస్లిం సోదరులతో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. అనంతరం అక్కడ నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. తన సొంత ఊరు అగ్రహారం అని తాను పుట్టింది, పెరిగింది, ఓనమాలు నేర్చుకుంది ఇక్కడే అన్నారు. మాది ఒక కుటుంబం అయినా ముస్లిం సోదరులందరూ తమ కుటుంబ సభ్యుల హక్కుల చేర్చుకున్నారన్నారు. అదేవిధంగా కావలిలో ఉన్న ముస్లిం సోదరులు కూడా తనను సొంత కుటుంబ సభ్యుల ఆదరిస్తున్నారన్నారు.. రాజకీయ ప్రస్థానం అగ్రహారం గ్రామం నుంచే మొదలైంది అన్నారు. ఇక్కడ ఎంపిటిసి, ఎంపీపీ గా రాజకీ యం ప్రారంభించి ఈరోజు ఎమ్మెల్యేగా కావలి ప్రజలను కాపు కాసుకునే అవకాశం వచ్చింది అన్నారు.. తన సొంత ఊరిలో అడుగు పెట్టగానే తన ఒళ్ళు పులకిందని చెప్పారు.. కావలి ఉదయగిరి నియోజకవర్గాల ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు.. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కావ్యా అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.