ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు 16-08-2025

 ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు 16-08-2025

- నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

కావలి పట్టణంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతు లచ్చన్న సాధారణ కుటుంబంలో పుట్టినా అసాధారణ వ్యక్తిత్వాన్ని చూపించి, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయి పటేల్ తర్వాత సర్దార్ బిరుదు పొందిన ఏకైక తెలుగువాడు గౌతు లచ్చన్న అని, ఆయన అకుంఠిత దీక్ష, పట్టుదల, పోరాట పటిమ వల్లే ఈ బిరుదు లభించిందన్నారు. స్వాతంత్ర సమరంలో 43 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించడం ద్వారా ఆయన దేశభక్తిని చాటుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మూడు సార్లు, ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికై ప్రజాసేవ చేసిన లచ్చన్న  కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానుభావుడన్నారు. బడుగు–బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. వృత్తిరీత్యా గౌడుకైనా, మద్యపానం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని భావించి, సమాజ భవిష్యత్తు కోసం మద్యపానాన్ని నిషేధించాలని పోరాడిన ధీరుడు లచ్చన్న అని, ఆయన చూపిన మార్గంలో నడవడం మన అందరి బాధ్యత అని అన్నారు. లచ్చన్న జీవితం ఒక స్ఫూర్తి దీపం అన్నారు. సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి, సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు కావలి ప్రజలకు ఒక స్ఫూర్తిదాయక సందర్భమయ్యాయని, ఆయన కలల సాకారం కోసం రాజకీయ రంగంలో, ప్రజాసేవలో తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సమాజ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts