కావలి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతం 15-08-2025

 అత్యద్భుతం.. తిరంగా సంబరం 

  • కావలిలో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 
  • ఉప్పొంగిన దేశభక్తి.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 
  • కావలి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతం 
  • రేపటి భవిష్యత్తు యువత.. గొప్ప నాయకుల చరిత్రను తెలుసుకోవాలి 
  • దేశ పరాక్రమాలను పీఎం నరేంద్ర మోడీ ప్రపంచానికి చాటి చెప్పారు 

కావలిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఒకపక్క సాంస్కృతిక కార్యక్రమాలు, మరోపక్క విద్యార్థుల కేరింతల నడుమ జాతీయ జెండా రెపరెపలాడింది. కావలి మున్సిపల్ కార్యాలయం, కావలి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అడుగడుగునా దేశభక్తి పెంపొందించేలా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మంత్రముగ్ధులయ్యారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీగా వెళ్లిన నేతలకు విద్యార్థులు పట్టణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై వేసిన దేశభక్తి కార్యక్రమాలు చూపర్లను కట్టిపడేశాయి. 

అనంతరం కావలి ఐకానిక్ ప్లేస్ అయిన సెల్ఫీ పాయింటును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. సెల్ఫీ పాయింట్ విశేషాలను ఎమ్మెల్యే ఎంపీకి వివరించారు. అనంతరం వేదిక పైకి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి 100 అడుగుల స్తూపం పై ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా రెపరెపలాడుతుండగా విద్యార్థులు, పట్టణ ప్రజలు హర్షధానాలు పలికారు. ఈ సందర్భంగా ఎంపీ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కావలిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా స్థాయిని తలపించాయని, ఎర్రకోటపై జెండా రెపరెపలాడిన విధంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

కావలి పట్టణానికి ప్రత్యేక గుర్తింపుని చేస్తూ ఐకానిక్ ప్లేస్ ను ఏర్పాటు చేసి ఐ లవ్ కావలి అంటూ సెల్ఫీ పాయింట్ని తీర్చిదిద్దిన ఎమ్మెల్యేను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో భారతదేశాన్ని మూడవ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టి భారత సైనిక శక్తిని చాటి చెప్పారని పేర్కొన్నారు. ఈనాటి చిన్నారులే రేపటి దేశ భవిష్యత్తు అని యువత భారతదేశ చరిత్రను, పరాక్రమాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందరో త్యాగధనుల ఊపిరే ఈనాటి స్వాతంత్రం అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశాన్ని అభివృద్ధి పథకం అడుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పి4 కార్యక్రమం ద్వారా పేదలను పేదరికం నుంచి బయటపడేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు పేదలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దేశభక్తి ఉప్పొంగేలా కావలిలో చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోమంది పోరాట వీరులు రక్తదారులతో స్వాతంత్రం సిద్ధించిందని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన స్వాతంత్ర ఉద్యమం 1947 ఆగస్టు 15న సిద్ధించిందని మూడు కోట్ల మంది ప్రాణాలు అర్పిస్తే ఇది సాధ్యమైంది అన్నారు. జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్యకు నెల్లూరు తో కావలితో ప్రత్యేక అనుబంధం ఉందని అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామికంగా కావలి అభివృద్ధి చెందుతుందని, యువతకు భారీగా ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగా కావాలి కనకపట్నం కాబోతుందని తెలిపారు.

స్వచ్ఛ కావలి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. త్రాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా, ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. పెద్ద పవన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి స్థానంలో అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నామని, కచేరి మిట్ట ఫైర్ స్టేషన్ రోడ్డులోని రైల్వే లైన్ పై ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా కావలిని అభివృద్ధి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న సైనికులకు ఆయన సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతన కార్పొరేషన్ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, కావలి పట్టణ టిడిపి అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, జనసేన కావలి నియోజకవర్గ ఇంచార్జి అలహరి సుధాకర్, టిడిపి నేతలు గుంటుపల్లి రాజ్ కుమార్, బీద గిరిధర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, నేతలు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, జనసేన నాయకులు గుడిహరి రెడ్డి, టిడిపి కావలి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts