పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 08-08-2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా కావలి గ్రామ దేవత కలుగోళ శంభావి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో జరుగుతున్న సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలను ఆయన తిలకించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు.
కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం లోని శ్రీశ్రీశ్రీ విజయదుర్గ ఆస్థానపీఠంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన వృద్ధాశ్రమానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వృద్ధాశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఆస్థాన పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య స్వామిని ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ఆస్థాన పీఠంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు. రాజువారి చింతలపాలెం కు చెందిన చేజర్ల కోటిలింగం - వెంకట శేషమ్మ దంపతుల కుమార్తె అపర్ణ నలుగు కార్యక్రమం రాజువారి చింతలపాలెంలోని వారి నివాసంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. రాజువారి చింతలపాలెం కు చెందిన పంకు తాతయ్య కుమారుడు మణిదీప్ ఇటీవల ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం వారి నివాసానికి చేరుకొని మణిదీప్ ను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కావలి రూరల్ మండలం రుద్రకోటలో భూలక్ష్మి, శ్రీలక్ష్మి నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవుని ఆశీస్సులతో గ్రామం చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..